Prabhas: విదేశాల్లో షూటింగ్ జరపడంతో కీలక నిర్ణయం తీసుకున్న ప్రభాస్

Prabhas decides to go isolation due to foreign shoot
  • కరోనా నేపథ్యంలో స్వీయ నిర్బంధంలోకి ప్రభాస్
  • ఇటీవలే జార్జియాలో ప్రభాస్ సినిమా చిత్రీకరణ
  • అందరూ సరైన జాగ్రత్తలు తీసుకోవాలన్న ప్రభాస్
టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్ తన కొత్త చిత్రం కోసం ఇటీవలే జార్జియాలో చిత్రీకరణలో పాల్గొన్నారు. ఆ షెడ్యూల్ ముగియడంతో కొన్నిరోజుల క్రితమే ప్రభాస్ సహా చిత్రబృందం భారత్ తిరిగొచ్చింది. కరోనా భయాలను కూడా లెక్కచేయకుండా ప్రభాస్ షూటింగ్ లో పాల్గొనడాన్ని మీడియా ప్రముఖంగా ప్రస్తావించింది.

అయితే, తనకు కరోనా లక్షణాలు లేకపోయినా విదేశాల్లో గడిపి రావడంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని ప్రభాస్ తాజాగా నిర్ణయించుకున్నారు. తన నిర్ణయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న తరుణంలో ఐసోలేషన్ లోకి వెళ్లాలని నిశ్చయించుకున్నాను. 'మీరు కూడా సరైన నివారణ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను' అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలంటూ ప్రభాస్ ఆకాంక్షించారు.
Prabhas
Corona Virus
Shooting
Georgia
Isolation

More Telugu News