Corona Virus: మహారాష్ట్రలో ప్రమాద ఘంటికలు.. కరోనా@స్టేజ్-3

Corona virus races towards stage three
  • మహారాష్ట్రలో అత్యధికంగా 63 కరోనా కేసులు
  • తాజా కేసుల్లో ముగ్గురు మహారాష్ట్ర గడ్డపైనే వైరస్ బారినపడినట్టు గుర్తింపు
  • కరోనా మహమ్మారి స్టేజ్-3 దిశగా పయనిస్తోందన్న మహారాష్ట్ర సర్కారు
గత కొన్ని వారాలుగా భారత్ ను పట్టిపీడిస్తున్న కరోనా భూతం మహారాష్ట్రలో అత్యధికంగా ప్రభావం చూపిస్తోంది. ఇప్పటివరకు అక్కడ 63 కేసులు నమోదయ్యాయి. తాజాగా 11 కొత్త కేసులు నమోదు కాగా, ఎనిమిది మంది విదేశాల్లో కరోనా సోకినవారు కాగా, మూడు కేసుల్లో మహారాష్ట్ర గడ్డపైనే వైరస్ సోకినట్టు గుర్తించారు. తద్వారా కరోనా ఇప్పుడు మూడో దశవైపు పయనిస్తున్నట్టు భావిస్తున్నారు. ఇప్పటిదాకా నమోదైన కరోనా బాధితులు అత్యధికం విదేశాల నుంచి వచ్చినవారే. అయితే, ఇక్కడున్న వాళ్లకు కూడా తాజాగా కరోనా సోకినట్టు వెల్లడవడంతో ఈ వైరస్ స్టేజ్-3కు చేరువలో ఉందని భావిస్తున్నారు. ఈ మేరకు మహారాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే ఓ ప్రకటనలో వెల్లడించారు.
Corona Virus
Maharashtra
Stage-3
India

More Telugu News