Ratnavelu: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలుకు మాతృవియోగం

Cinematographer Ratnavelu mother dies of illness
  • రత్నవేలు తల్లి జ్ఞానేశ్వరి కన్నుమూత
  • కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జ్ఞానేశ్వరి
  • తల్లి మరణంతో తీవ్ర విషాదంలో రత్నవేలు
దక్షిణాదిన అనేక హిట్ చిత్రాలకు కెమెరామన్ గా పనిచేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలుకు మాతృవియోగం కలిగింది. రత్నవేలు తల్లి జ్ఞానేశ్వరి కన్నుమూశారు. ఆమె పూర్తిపేరు జ్ఞానేశ్వరి రామన్. ఆమె వయసు 80 సంవత్సరాలు. జ్ఞానేశ్వరి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో శనివారం తుదిశ్వాస విడిచారు. కాగా, తన తల్లి మరణంతో రత్నవేలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మాతృమూర్తి మరణంపై రత్నవేలు భావోద్వేగభరితంగా స్పందించారు.

"నా కళ్లలోకి చూసి నా ఆశయాలను, ఆకాంక్షలను గ్రహించగల వ్యక్తి మా అమ్మ. ఎప్పుడూ నా వెన్నంటే నిలిచింది. జీవితంలో ఏమేం సాధించాలని అనుకున్నానో అన్నింటినీ సాకారం అయ్యేలా చేసిన అమృతమూర్తి మా అమ్మ. ఇవాళ నేనీ స్థితిలో ఉన్నానంటే అందుకు మా అమ్మే కారణం. నా స్ఫూర్తి, నా శక్తి, నా సంతోషం అన్నీ ఆమే. అమ్మా, నిన్నెంతో మిస్సవుతున్నాను. జీవితకాలం నీకు రుణపడివుంటాను" అంటూ ట్వీట్ చేశారు.

Ratnavelu
Mother
Death
Jnaneshwari
Cinematographer
Tollywood
Kollywood

More Telugu News