KTR: ఇటలీ, అమెరికాల్లో పరిస్థితులు చూస్తున్నాం.. సురక్షితంగా ఉండండి: కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
- హాంకాంగ్, సింగపూర్, జపాన్ కరోనాను సమర్థవంతంగా అరికడుతున్నాయి
- ఇటలీ, అమెరికా వంటి దేశాలు మాత్రం సరైన సమయంలో స్పందించలేదు
- ఇప్పుడు విచారం వ్యక్తం చేస్తున్నాయి
- దయచేసి ప్రభుత్వం చేస్తోన్న సూచనలు పాటించండి
ప్రపంచం మొత్తం కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు తీసుకుంటోన్న విషయం తెలిసిందే. దేశంలో కరోనా వ్యాప్తిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ట్వీట్ చేశారు. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్న దేశాలను గురించి ప్రస్తావించారు. 'హాంకాంగ్, సింగపూర్, జపాన్ దేశాలు కరోనాను సమర్థవంతంగా అరికడుతున్నాయి. ఇటలీ, అమెరికా వంటి దేశాలు మాత్రం సరైన సమయంలో సరైన రీతిలో స్పందించలేకపోయినందుకు విచారం వ్యక్తం చేస్తున్నాయి' అని పేర్కొన్నారు.
'సామాజిక దూరం, వ్యక్తిగత నిర్భందం, నియంత్రణలు పాటించడం చాలా ముఖ్యం. దయచేసి ప్రభుత్వం చేస్తోన్న సూచనలు పాటించి సురక్షితంగా ఉండండి' అని కేటీఆర్ ట్వీట్ చేశారు. హాంకాంగ్, సింగపూర్, జపాన్ వంటి దేశాలు కరోనాను ఎలా అరికట్టాయో తెలిపే గ్రాఫ్‌ను ఆయన పోస్టు చేశారు.