Sania Mirza: 'జనతా కర్ఫ్యూ' ద్వారా వైరస్‌పై పోరాటంలో మనకున్న క్రమశిక్షణను చాటుదాం!: సానియా మీర్జా

sania mirza on corona

  • మోదీతో కలిసి 'జనతా కర్ఫ్యూ' పాటిద్దాం
  • ప్రమాదకరమని తెలిసినా కూడా కొందరు మనకు సేవలందిస్తున్నారు
  • వారికి సంఘీభావం తెలుపుదాం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు 'జనతా కర్ఫ్యూ' పాటించడానికి దేశ ప్రజలంతా కలిసి ముందుకు రావాలని, ఆయనతో కలిసి ఇందులో పాల్గొనాలని భారత టెన్నిస్ తార సానియా మీర్జా పిలుపునిచ్చారు.

ప్రమాదకరమని తెలిసి కూడా మనం సురక్షితంగా ఉండడానికి సేవలు అందిస్తోన్న వారి (వైద్య సిబ్బంది)కి సంఘీభావం తెలుపుదామని ఆమె ట్వీట్ చేసింది. రేపు నిర్వహించే జనతా కర్ఫ్యూకి కట్టుబడి ఉందామని పేర్కొంది. ప్రాణాంతక వైరస్‌పై పోరాటంలో మనకున్న క్రమశిక్షణను చాటుదామని తెలిపింది. చివరకు జై హింద్‌ అని చెప్పింది.

నరేంద్ర మోదీ ఇచ్చిన 'జనతా కర్ఫ్యూ' పిలుపునకు అనూహ్య స్పందన వస్తోంది. సోషల్ మీడియాలో చాలా మంది సెలబ్రిటీలు పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. జనతా కర్ఫ్యూకు ఇప్పటికే వ్యాపారులు కూడా మద్దతు తెలిపారు.

Sania Mirza
Corona Virus
Hyderabad
  • Loading...

More Telugu News