Dubai: దుబాయ్ నుంచి వచ్చి అదృశ్యమైన యువకుడు.. పోలీసుల వెతుకులాట

Hyderabad Police searching for Dubai return man

  • ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన యూపీ యువకుడు
  • స్వగ్రామం వెళ్లేందుకు దుబాయ్ నుంచి శంషాబాద్‌కు
  • మార్గమధ్యంలో అదృశ్యం

దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చి ఆ తర్వాత అదృశ్యమైన యువకుడి జాడ కోసం హైదరాబాద్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌కు చెందిన అలీమ్ (26) ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. తాజాగా, స్వగ్రామం వెళ్లేందుకు దుబాయ్ నుంచి విమానంలో వచ్చిన అలీమ్ శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండయ్యాడు. అక్కడి నుంచి మరో విమానంలో యూపీ వెళ్లాల్సి ఉంది. అయితే, మార్గమధ్యంలోనే అతడు అదృశ్యం కావడం కలకలం రేగింది. యువకుడి అదృశ్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడి జాడ కనుక్కునే పనిలో పడ్డారు.

Dubai
Uttar Pradesh
Shamshabad airport
Corona Virus
  • Loading...

More Telugu News