Firecracker Unit: తమిళనాడులో బాణసంచా కర్మాగారంలో భారీపేలుడు... ఏడుగురి దుర్మరణం

Heavy blast at a firecracker unit in Tamilnadu

  • విరుదునగర్ జిల్లా సిప్పిప్పారై వద్ద దుర్ఘటన
  • పూర్తిగా ధ్వంసమైన కర్మాగారం
  • మృతుల్లో ఆరుగురు మహిళలు
  • ఏడుగురికి తీవ్రగాయాలు

బాణసంచా కర్మాగారాలకు నిలయమైన తమిళనాడులో అనేక ప్రమాదాలు జరిగినా జాగ్రత్త చర్యలు శూన్యం అని చాటుతూ మరో దుర్ఘటన జరిగింది. విరుదునగర్ జిల్లాలోని సత్తూరు సమీపంలోని సిప్పిప్పారై వద్ద ఓ బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించగా, మరో ఏడుగురు తీవ్రగాయాలతో ఆసుపత్రిపాలయ్యారు. మృతి చెందిన వారిలో ఆరుగురు మహిళలున్నారు. పేలుడు తీవ్రతకు కర్మాగారం పూర్తిగా ధ్వంసమైనట్టు తెలుస్తోంది. శిథిలాల కింద చిక్కుకున్న క్షతగాత్రులను సహాయ సిబ్బంది బయటకు తీసుకువచ్చి ఆసుపత్రికి తరలించారు.

Firecracker Unit
Blast
Sippipparai
Tamilnadu
  • Loading...

More Telugu News