Chiranjeevi: చిరూ సినిమా కోసం భారీగా డిమాండ్ చేసిన కాజల్?

Acharya Movie

  • షూటింగు దశలో 'ఆచార్య' 
  • కోటిన్నరకి ఓకే చెప్పిన కాజల్ 
  • త్వరలోనే షూటింగుకి హాజరు 

చిరంజీవి .. కొరటాల కాంబినేషన్లో 'ఆచార్య' సినిమా రూపొందుతోంది. వినోదానికి సందేశాన్ని మేళవించి కొరటాల సిద్ధం చేసుకున్న కథ ఇది. చిరంజీవిని కొత్త లుక్ తో ఆయన చూపించనుండటం ఆసక్తికరంగా మారింది. అలాగే ఈ సినిమాలో చరణ్ కూడా నటిస్తుండటం మరో ప్రత్యేక అంశంగా కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలోనే కథానాయికగా ఎన్నికైన 'త్రిష' ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. దాంతో 'ఖైదీ నెంబర్ 150' సినిమాను దృష్టిలో పెట్టుకుని, కాజల్ అయితే బాగుంటుందని భావించి సంప్రదింపులు జరిపారట. అయితే పారితోషికంగా ఆమె రెండున్నర కోట్లు అడిగిందట. చివరికి ఒకటిన్నర కోటికి చేయడానికి ఆమె అంగీకరించినట్టు సమాచారం. త్వరలోనే ఆమె షూటింగులో పాల్గొననున్నట్టు చెబుతున్నారు. మరోసారి తెరపై ఈ జంట ఏ రేంజ్ లో సందడి చేస్తుందో చూడాలి మరి.

Chiranjeevi
Charan
Kajal Agarwal
Acharya Movie
  • Loading...

More Telugu News