Allari Naresh: ఈవీవీ కథతో రంగంలోకి 'అల్లరి' నరేశ్

Allari Naresh Movie

  • హాస్య కథానాయకుడిగా మంచి క్రేజ్ 
  •  పరాజయాల కారణంగా తగ్గిన జోరు 
  • తండ్రి రాసుకున్న కథతో సెట్స్ పైకి  

రాజేంద్ర ప్రసాద్ తరువాత హాస్య కథానాయకుడిగా 'అల్లరి' నరేశ్ తన సత్తా చాటుకున్నాడు. చాలా వేగంగా ఆయన 50 సినిమాలను పూర్తి చేశాడు. ఆ తరువాత వరుసగా పరాజయాలు పలకరిస్తూ ఉండటంతో, ఆయన జోరు కాస్త తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు సినిమాలు వున్నాయి. ఆ తరువాత ప్రాజెక్టును లైన్లో పెట్టే పనిలో ఆయన వున్నాడని సమాచారం.

గతంలో ఈవీవీ సిద్ధం చేసిన ఒక కథను ఆయన సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడని అంటున్నారు. ఈవీవీ కథల కారణంగానే అప్పట్లో 'అల్లరి' నరేశ్ వరుస విజయాలను అందుకున్నాడు. అందువల్లనే గతంలో ఈవీవీ రాసుకున్న కథల్లోని ఒక కథను ఎంచుకుని 'అల్లరి' నరేశ్ రంగంలోకి  దిగుతున్నాడని అంటున్నారు. తనకి సన్నిహితుడైన ఒక దర్శకుడితో ఈ సినిమాను నిర్మించడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు.

Allari Naresh
EVV
Tollywood
  • Loading...

More Telugu News