Roja: నలుగురి ఉరి.. ఇలాంటి ఉన్మాదులకు కనువిప్పు కావాలి: రోజా

Nirbhaya soul rests in peace says Roja
  • నిర్భయకు న్యాయం జరిగింది
  • క్రూరమృగాల ఉరితో నిర్భయ ఆత్మ శాంతిస్తుంది
  • పోరాడిన నిర్భయ తల్లికి వందనం చేస్తున్నా
ఈ ఉదయం 5.30 గంటలకు నలుగురు నిర్భయ దోషులను ఉరితీసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందిస్తూ, నిర్భయకు న్యాయం జరిగిందని అన్నారు. క్రూరమృగాల ఉరితో నిర్భయ ఆత్మ శాంతిస్తుందని చెప్పారు. ఏడున్నరేళ్లుగా తన కూతురుని హతమార్చిన నిందితులకు శిక్షపడేందుకు పోరాడిన నిర్భయ తల్లికి వందనం చేస్తున్నానని అన్నారు. నలుగురు దోషుల ఉరి.. ఇలాంటి ఉన్మాదులకు కనువిప్పు కావాలని చెప్పారు. ఈ మేరకు ఆమె ఫేస్ బుక్ లో స్పందించారు.
Roja
YSRCP
Nirbhaya

More Telugu News