Kerala: ముందు జాగ్రత్తతో సామాజిక దూరం పాటిస్తున్న మందుబాబులు... ఈ వీడియో తెగ వైరల్!

Customers Queue in front of Kerala Wines Shop

  • మందు బాబుల మధ్య మీటర్ దూరం
  • క్రమశిక్షణతో మద్యం కొనుగోలు
  • అందరికీ ఆదర్శమంటూ నెటిజన్ల సెటైర్లు

కరోనా వైరస్ భయాలు ప్రపంచాన్ని పీడిస్తున్న వేళ, కేరళ మందుబాబులు సామాజిక దూరం పాటిస్తున్న వీడియో తెగ వైరల్ అవుతోంది. అత్యవసర పనులకు మాత్రమే బయటకు రావాలని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తుంటే, వీరంతా ఓ పద్ధతి ప్రకారం, క్యూలో ఒకరిని ఒకరు తాకకుండా నిలబడి, తమకు కావాల్సిన మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు.

ఇక ఈ వీడియోను చూసిన వారంతా, ప్రజలకు ఈ మందుబాబులు ఆదర్శమని సెటైర్ మీద సెటైర్లు వేస్తున్నారు. ఒక్కొక్కరికీ కనీసం మీటర్ దూరం ఉండాలని చెబుతూ మద్యం దుకాణం ముందు ముగ్గుతో గీతలు గీయగా, అందరూ క్రమశిక్షణతో తమకు కేటాయించిన వరుసలో కదులుతూ ఉన్న వీడియోను చూసి నవ్వుకుంటున్నారు. ఇక కొందరు మాస్కులతో, మరికొందరు హెల్మెట్లతో ఈ క్యూ లైన్లో నిలబడి వుండటం గమనార్హం. ఆ వీడియోను మీరూ చూసేయండి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News