Jagan: న్యాయం జరిగింది: నిర్భయ దోషుల ఉరితీతపై ప్రధాని మోదీ
- నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలుపై మోదీ స్పందన
- మహిళలకు గౌరవ స్థానాన్ని, రక్షణను కల్పించడంలో భరోసా ఇవ్వాలి
- మన నారీ శక్తి ప్రతి రంగంలోనూ ప్రతిభ కనబర్చుతోంది
నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలైన విషయం తెలిసిందే. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. 'న్యాయం జరిగింది. మహిళలకు గౌరవ స్థానాన్ని, రక్షణను కల్పించడంలో భరోసా ఇవ్వడం చాలా ముఖ్యం. మన నారీ శక్తి ప్రతి రంగంలోనూ ప్రతిభ కనబర్చుతోంది. మహిళల సాధికారతపై దృష్టి పెట్టి, సమానత్వం, సమాన అవకాశాలు కల్పించే దిశగా దేశం ముందుకు వెళ్లాల్సి ఉంది' అని పేర్కొన్నారు.
ఉరి అమలుపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ... 'క్రూరమైన నేరానికి పాల్పడిన అందరు నేరస్తులకు కఠిన శిక్ష పడింది. ఈ శిక్ష మరింత త్వరగా పడితే బాగుండేది' అని తెలిపారు. దోషులకు శిక్షపడడం పట్ల నిర్భయ తల్లి ఆశా దేవి కూడా హర్షం వ్యక్తం చేసింది.