Ranveer Singh: వాయిదా పడిన సినిమాల జాబితాలో '83'

83 Movie

  • కపిల్ జీవితచరిత్ర ఆధారంగా '83'
  • ముందుగా అనుకున్న విడుదల తేదీ ఏప్రిల్ 10
  • త్వరలో కొత్త విడుదల తేదీ ప్రకటన    

క్రికెటర్ కపిల్ దేవ్ జీవితచరిత్ర ఆధారంగా '83' చిత్రం రూపొందింది. కపిల్ దేవ్ గా రణ్వీర్ సింగ్ నటించగా, ఆయన భార్య పాత్రలో దీపిక పదుకొనె కనిపించనుంది. విష్ణు ఇందుకూరి .. సాజిద్ నడయాడ్వాలా .. కబీర్ ఖాన్ ఈ సినిమాను నిర్మించారు. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించాడు.


భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాను, ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 10వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే ప్రయత్నంలో భాగంగా తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలియజేస్తూ నిర్మాతలు ఒక ప్రకటన చేశారు. పరిస్థితులు చక్కబడిన తరువాత కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు.

Ranveer Singh
Deepika Padukone
83 Movie
  • Loading...

More Telugu News