Pavan kalyan: పవన్ సరసన శ్రుతి హాసన్ ఖరారు!

Vakeel Saab Movie

  • షూటింగు దశలో 'వకీల్ సాబ్'
  • దర్శకుడిగా వేణు శ్రీరామ్ 
  •  విద్యాబాలన్ పాత్రలో శ్రుతి హాసన్

పవన్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' రూపొందుతోంది. 'దిల్' రాజు నిర్మిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలకిగాను, నివేదా థామస్ .. అంజలి .. అనన్యలను ఎంపిక చేశారు. మరో ముఖ్యమైన పాత్రకిగాను కొంతమంది కథానాయికల పేర్లను పరిశీలించారు. చివరికి శ్రుతి హాసన్ ను ఖరారు చేసినట్టు సమాచారం.

తమిళంలో విద్యాబాలన్ చేసిన పాత్రకి గాను శ్రుతి హాసన్ ను తీసుకున్నారని అంటున్నారు. గతంలో పవన్ - శ్రుతి హాసన్ కాంబినేషన్లో వచ్చిన 'గబ్బర్ సింగ్' సంచలన విజయాన్ని సాధించింది. మళ్లీ ఇంతకాలానికి ఈ కాంబినేషన్ సెట్ అయింది. పవన్ కల్యాణ్ .. శ్రుతి హాసన్ జోడీని మళ్లీ తెరపై  చూడాలనుకుంటున్న అభిమానులకు ఇది శుభవార్తే.

Pavan kalyan
Sruthi Hassan
Vakeel Saab Movie
  • Loading...

More Telugu News