Corona Virus: కరోనా అప్ డేట్.. 177 దేశాలు, 9,800 మృతులు!

Corona Virus Update

  • వ్యాధి బారిన 2.20 లక్షల మంది
  • మృతుల సంఖ్యలో చైనాను దాటేసిన ఇటలీ
  • వైరస్ ను అణచివేయాలన్న డబ్ల్యూహెచ్ఓ

ప్రపంచ మహమ్మారి కరోనా 177 దేశాలకు విస్తరించింది. వ్యాధి బారిన 2,20,313 మంది పడగా, ఇప్పటివరకూ నమోదైన మృతుల సంఖ్య 9,800 దాటిందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన అన్ని దేశాలూ, కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నా, ప్రజల సహకారం లేక, వ్యాధి విస్తరిస్తోందని, చైనా తరహాలో వైరస్ అణచివేత కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్ఓ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. నిన్న ఇటలీలో 427, స్పెయిన్ లో 165, ఇరాన్ లో 149 మంది మృతి చెందారని ఇటలీలో మొత్తం మృతుల సంఖ్య చైనాను దాటి 3,500కు చేరువైందని వెల్లడించారు. శుక్రవారం కూడా చైనాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదన్నారు.

Corona Virus
WHO
Countries
  • Loading...

More Telugu News