Kenya: కెన్యాలో దారుణం... కరోనా ఉందన్న అనుమానంతో కొట్టి చంపారు!

Man was beaten to death by a mob in Kenya

  • బార్ కు వెళ్లి వస్తున్న వ్యక్తిపై యువకుల దాడి
  • కరోనా అందరికీ అంటిస్తాడేమోనని రాళ్లతో కొట్టిన యువకులు
  • తీవ్రగాయాలతో ఆసుపత్రిలో మరణించిన వ్యక్తి

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భూతం మృత్యుఘంటికలు మోగిస్తోంది. అగ్రరాజ్యం, చిన్న దేశం అనే తేడా లేకుండా గజగజలాడిస్తోంది. తాజాగా కెన్యాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తికి కరోనా ఉందన్న అనుమానంతో కొందరు యువకులు కొట్టిచంపారు. క్యాలే ప్రాంతంలోని ఎంసాబ్వెని గ్రామంలో ఈ ఘటన జరిగింది.

జార్జ్ కొటిని హెజ్రోన్ అనే వ్యక్తి బార్ కు వెళ్లి వస్తుండగా ఓ జన సమూహం అతడిని అడ్డగించింది. ఆ సమూహంలోని యువకులు అతడికి కరోనా వైరస్ సోకిందని అనుమానం వ్యక్తం చేశారు. తమకు కూడా వైరస్ అంటిస్తాడన్న భయంతో రాళ్లతో దాడి చేశారు. తీవ్రగాయాలపాలైన హెజ్రోన్ ను స్థానిక ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది.

దీనిపై స్థానిక పోలీస్ అధికారి జోసెఫ్ ఎన్ తెంగే మాట్లాడుతూ, మృతుడికి కరోనా వైరస్ ఉందో, లేదో స్పష్టంగా తెలియదన్నారు. ఆ వ్యక్తి అస్వస్థతతో బాధపడుతున్నవాడిలా ఊగుతూ నడుస్తుండడంతో కరోనా సోకిందేమోనని స్థానికులు భయపడ్డారని, అందుకే కొట్టి చంపి ఉంటారని భావిస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News