YS Sunitha Reddy: కరోనా వైరస్ గురించి వైయస్ వివేకానందరెడ్డి కుమార్తె డా.సునీత సూచనలు!

YS Sunitha Reddy suggetions for Corona

  • జ్వరం, దగ్గు వస్తే తగు మందులు వాడాలి
  • కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే సెల్ఫ్ క్వారంటైన్ విధించుకోవాలి
  • క్వారంటైన్ లో ఉన్నప్పుడు కాస్త వ్యాయామం కూడా అవసరం

కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయని దివంగత వైయస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి అన్నారు. మన శరీర లక్షణాలను బట్టి చికిత్స తీసుకోవాలని ఆమె సూచించారు. జ్వరంగా ఉంటే పారాసిటమాల్, దగ్గు ఉంటే దానికి తగ్గ మందు తీసుకోవాలని చెప్పారు. కరోనా లక్షణాలు కనిపిస్తే ఎవరినీ కలవకుండా సెల్ఫ్ క్వారంటైన్ చేసుకోవాలని అన్నారు. దీనివల్ల ఈ వైరస్ ఇతరులకు సోకకుండా ఉంటుందని చెప్పారు.

కరోనా లక్షణాలు కనిపించిన వారిని 14 నుంచి 15 రోజుల పాటు క్వారంటైన్ లో పెట్టడం అవసరమని సునీతారెడ్డి అన్నారు. ఫోన్లలో మాట్లాడటం ద్వారా ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. మెడిటేషన్ చేయడం ద్వారా మానసిక స్థైర్యాన్ని పొందొచ్చని చెప్పారు. క్వారంటైన్ లో ఉన్న సమయంలో కాస్త వ్యాయామం కూడా అవసరమని అన్నారు. ఎంతసేపూ కూర్చొని లేదా పడుకుని ఉంటే శరీరం బలహీనపడుతుందని చెప్పారు. చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చని తెలిపారు. ఈ మేరకు ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తగు సూచనలను అందించారు.

  • Loading...

More Telugu News