Mohan Babu: నాన్నా.. నువ్వు వన్ మేన్ ఆర్మీ: మంచు లక్ష్మి

You are one man army nanna says Manchu Lakshmi

  • నేడు మోహన్ బాబు జన్మదినం
  • 70వ పడిలోకి అడుగుపెట్టిన కలెక్షన్ కింగ్
  • పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్న సినీ, రాజకీయ ప్రముఖులు

ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు జన్మదినం నేడు. ఈరోజు ఆయన 70వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. తన తండ్రి పుట్టినరోజును పురస్కరించుకుని మోహన్ బాబు తనయ మంచు లక్ష్మి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

'మా నాన్న పుట్టిన రోజు. ప్రతి సంవత్సరం ఈరోజు మాకు గొప్ప వేడుక. మీరు వన్ మేన్ ఆర్మీ నాన్నా. లవ్యూ టు ది మూన్ అండ్ బ్యాక్' అని ఆమె ట్వీట్ చేశారు.

మరోవైపు, కరోనా నేపథ్యంలో పుట్టినరోజు వేడుకలను మోహన్ బాబు రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్ లో జరగాల్సిన వేడుకలను వాయిదా వేశారు. పుట్టినరోజు శుభాకాంక్షలను తెలపడానికి ఎవరూ రావద్దని మోహన్ బాబు విన్నవించారు.

Mohan Babu
Birthday
Manchu Lakshmi
  • Loading...

More Telugu News