Prabhas: ప్రభాస్ 22వ సినిమా దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగా?

Sandeep Reddy Vanga Movie

  • సెట్స్ పై ప్రభాస్ సినిమా 
  •  రంగంలోకి దిగనున్న నాగ్ అశ్విన్ 
  •  స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న సందీప్ రెడ్డి  

ప్రస్తుతం ప్రభాస్ .. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ప్రభాస్ కి ఇది 20వ సినిమా. ఈ సినిమాకి 'ఓ డియర్' .. 'రాధే శ్యామ్' అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమా తరువాత ఆయన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇటీవల వచ్చేసింది. వైజయంతీ మూవీస్ బ్యానర్లో ఆయన ఈ సినిమా చేయనున్నాడు.

ఆ తరువాత సినిమాను సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఆల్రెడీ సందీప్ రెడ్డి .. ప్రభాస్ కి ఒక లైన్ వినిపించాడట. ప్రస్తుతం పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేసే పనిలో వున్నాడని అంటున్నారు. పూర్తి స్క్రిప్ట్ పట్ల ప్రభాస్ సంతృప్తిని వ్యక్తం చేస్తే, వెంటనే సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. టి సిరీస్ వారు ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తారని అంటున్నారు. ప్రభాస్ ని సందీప్ రెడ్డి ఒప్పిస్తాడో లేదో చూడాలి మరి.

Prabhas
Radha Krishna Kumar
Sandeep Reddy Vanga Movie
  • Loading...

More Telugu News