SCR: లక్షల సంఖ్యలో రైలు టికెట్లు క్యాన్సిల్... 39 రైళ్లను రద్దు చేసిన ద.మ.రైల్వే
- రోజురోజుకూ పెరుగుతున్న కరోనా భయం
- 30 శాతం కూడా ప్రయాణికులు లేని రైళ్లు క్యాన్సిల్
- నెలాఖరు వరకూ పలు రైళ్లు రద్దు
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉండటం, లక్షల సంఖ్యలో రైలు టికెట్లు క్యాన్సిల్ అవుతూ ఉండటంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. కొన్నింటిని ఈ నెలాఖరు వరకూ, మరికొన్నింటిని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ రైళ్లలో 30 శాతం ప్రయాణికులు కూడా లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. రద్దయిన రైళ్ల వివరాలు పరిశీలిస్తే...
* కాకినాడ టౌన్ - లింగంపల్లి (02775) మార్చి 31 వరకు
* లింగంపల్లి - కాకినాడ టౌన్ (02776) మార్చి 31 వరకు
* మచిలీపట్నం - సికింద్రాబాద్ (07049) మార్చి 22 నుంచి 29 వరకు
* సికింద్రాబాద్ - మచిలీపట్నం (07050) మార్చి 22 నుంచి 29 వరకు
* యర్నాకులం - హైదరాబాద్ (07118) మార్చి 25, 26 తేదీల్లో
* హైదరాబాద్ - యర్నాకులం (07117) మార్చి 25, 26 తేదీల్లో
* హైదరాబాద్ - విజయవాడ (07257) మార్చి 23 నుంచి 30 వరకు
* తిరుచిరాపల్లి - హైదరాబాద్ (07609) మార్చి 25 నుంచి ఏప్రిల్ 1 వరకు
* హైదరాబాద్ - తిరుచిరాపల్లి (07610) మార్చి 25 నుంచి 30 వరకు
* హెచ్ఎస్ నాందేడ్ - ఔరంగాబాద్ (17620) మార్చి 20 నుంచి 27 వరకు
* ఔరంగాబాద్ -హెచ్ఎస్ నాందేడ్ (17619) మార్చి 23 నుంచి 30 వరకు
* ఔరంగాబాద్ - రేణిగుంట (17621) మార్చి 20 నుంచి 27 వరకు
* రేణిగుంట - ఔరంగాబాద్ (17622) మార్చి 21 నుంచి 28 వరకు
* తిరుపతి - చెన్నై సెంట్రల్ (16204) మార్చి 18 నుంచి 31 వరకు
* చెన్నై సెంట్రల్ - తిరుపతి (16203) మార్చి 18 నుంచి 31 వరకు
* కాన్పూర్ - కాచిగూడ (04155) మార్చి 26న నడిచే రైలు
* కాచిగూడ - కాన్పూర్ (04156) మార్చి 27న నడిచే రైలు