Nirbhaya: మళ్లీ పిటిషన్ వేసిన నిర్భయ దోషులు!

  • ఈ నెల 20న నిర్భయ దోషులు నలుగురికి ఉరిశిక్ష
  • ఇప్పటికే తమ పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయన్న దోషులు
  • ‘స్టే’ కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన వైనం

ఈ నెల 20వ తేదీన నిర్భయ దోషులు నలుగురికి ఉరిశిక్ష అమలు జరగనున్న విషయం తెలిసిందే. ఉరి శిక్ష నుంచి తప్పించుకునేందుకు ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేసిన నిర్భయ దోషులు తాజాగా మరో ప్రయత్నం చేశారు. ఉరి శిక్షపై ‘స్టే’ విధించాలని కోరుతూ ఇప్పటికే తాము దాఖలు చేసుకున్న పలు పిటిషన్లు పెండింగ్ లో ఉన్న కారణంగా శిక్షను నిలిపివేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్  నేపథ్యంలో తీహార్ జైలు అధికారులకు, ప్రభుత్వం తరఫు న్యాయవాదికి కోర్టు నోటీసులు అందాయి. ఈ పిటిషన్ పై రేపు విచారణ జరగనున్నట్టు తెలుస్తోంది.

Nirbhaya
convicts
Delhi high court
petetion
  • Loading...

More Telugu News