Hyper Aadi: నాగబాబుగారికి నేను ఎప్పుడూ దూరం కాదు: హైపర్ ఆది

 Hiper Adi about the relation with Nagababu

  • ఏ విషయంలోనైనా పోటీ ఉండవలసిందే
  • నాగబాబుగారు మాకు కావలసిన వ్యక్తి 
  • అందుకే ఆయనతో నిలబడలేకపోయానన్న ఆది

'జబర్దస్త్' కామెడీ షోతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న 'హైపర్' ఆది, తాజా ఇంటర్వ్యూలో నాగబాబు గురించి ప్రస్తావించాడు. "జబర్దస్త్ .. 'అదిరింది' కార్యక్రమాల టీఆర్పీ రేటింగ్స్ గురించి నేను మాట్లాడను. ఎందుకంటే ఆ కార్యక్రమం కూడా బాగుండాలనే నేను కోరుకుంటున్నాను .. పోటీ ఉండాలనే భావిస్తున్నాను. అక్కడున్న వాళ్లంతా కూడా బాగా కావలసిన వాళ్లే.

ఇక నాగబాబుగారి విషయానికే వస్తే, ఆయన మా అందరికీ బాగా కావలసిన వ్యక్తి. ఆయన ఎక్కడున్నా కూడా మేమందరం బాగుండాలనే కోరుకుంటూ వుంటారు .. మెసేజ్ లు కూడా చేస్తుంటారు. నాగబాబుగారు వెళ్లిన చోట వున్న కొంతమంది వ్యక్తుల గురించి నాకు తెలిసిన నిజాల వలన, నేను ఆయనతో నిలబడలేకపోయాను. నేను ఆ షోకి .. కొంతమంది వ్యక్తులకు మాత్రమే దూరం. నాగబాబుగారికి నేను ఎప్పటికీ దూరం కాదు. ఈ విషయం ఆయనకి కూడా తెలుసు" అని చెప్పుకొచ్చాడు.

Hyper Aadi
Nagababu
Jabardasth
  • Loading...

More Telugu News