Tirumala: ఆగమ శాస్త్రంలో తిరుమల ఆలయాన్ని మూసివేసే వీలుంది: తిరుమల ప్రధానార్చకుని కామెంట్!
- తిరుమలలోనూ కరోనా ప్రభావం
- కైంకర్యాలను ఏకాంతంగా నిర్వహించే వీలుంది
- భక్తులు రాకుండా నిలువరించ వచ్చన్న వేణుగోపాల దీక్షితులు
ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్ ప్రభావం తిరుమల గిరులను తాకిన వేళ, మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు సంచలన కామెంట్స్ చేశారు. పరిస్థితి విషమిస్తున్నదని భావిస్తే, స్వామివారి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేసే సదుపాయం ఉన్నదని, ఈ మేరకు శతాబ్దాల క్రితమే పండితులు నిర్ధారించిన ఆగమ శాస్త్రంలో అవకాశం ఉందని తెలిపారు. స్వామివారికి అన్ని కైంకర్యాలనూ ఏకాంతంగా నిర్వహించే వీలుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కూడా కొన్ని సార్లు, కొన్ని కైంకర్యాలను ఏకాంతంగా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేసిన ఆయన, కరోనా విజృంభిస్తే, కొన్ని రోజుల పాటు ఆలయంలోకి భక్తులు రాకుండా నిలుపుదల చేయవచ్చని సూచించారు.