Ram: హద్దులు దాటే హెబ్బా ఐటమ్ సాంగ్!

Red Movie

  • కిషోర్ తిరుమల నుంచి 'రెడ్'
  • ఐటెమ్ సాంగులో మెరవనున్న హెబ్బా 
  • రామ్ సరసన ముగ్గురు నాయికలు  

తెలుగు తెరపై కథానాయికగా హెబ్బా పటేల్ కి మంచి క్రేజ్ వుంది. ఒక వైపున కథానాయికగా చేస్తూనే, మరో వైపున కీలకమైన పాత్రలు చేస్తూ వస్తోంది. ఇటీవల రామ్ 'రెడ్' సినిమాలో ఐటమ్ సాంగ్ కూడా చేసింది. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చక చకా షూటింగ్ జరుపుకుంటోంది.

ఇటీవల రామ్ - హెబ్బా పటేల్ కాంబినేషన్లో ఒక ఐటెమ్ సాంగును హైదరాబాదు - రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించారు. ఈ ఐటెమ్ సాంగులో అందాలు ఆరబోయడానికి హెబ్బా పటేల్ ఎంతమాత్రం మొహమాట పడలేదట. హద్దులు దాటేసి ఆమె ఒలకబోసిన వయ్యారాలు యూత్ ను ఒక ఊపు ఊపేస్తాయని అంటున్నారు. ఈ ఐటెమ్ సాంగ్ బయటికి వచ్చిన తరువాత, ఈ తరహా సాంగ్స్ కి హెబ్బా కేరాఫ్ అడ్రెస్ గా మారిపోతుందని చెబుతున్నారు. ఈ సినిమాలో రామ్ సరసన మాళవిక శర్మ .. నివేద పేతురాజ్ .. అమృత అయ్యర్ అలరించనున్నారు.

Ram
Malavika Sharma
Niveda Pethuraj
Red Movie
  • Loading...

More Telugu News