Lavanya Tripathi: అతని వేధింపులపై చర్యలు తీసుకోండి: నటి లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi complains to Cyberabad police

  • సైబర్ వేధింపులపై పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి
  • మెయిల్ ద్వారా సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు
  • ఓ వ్యక్తి తనపై అసత్య ప్రచారం చేస్తున్నాడంటూ ఆరోపణ

సైబర్ వేధింపుల విషయంలో టాలీవుడ్ యువనటి లావణ్య త్రిపాఠి పోలీసులను ఆశ్రయించారు. ఓ వ్యక్తి తనపై అసత్య ప్రచారం చేస్తున్నాడంటూ మెయిల్ ద్వారా సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సునిషిత్ అనే వ్యక్తిని తాను పెళ్లి చేసుకున్నట్టు అబద్ధపు ప్రచారం చేస్తున్నాడని లావణ్య త్రిపాఠి ఆరోపించారు. తన పట్ల వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆమె పోలీసులను కోరారు. సోషల్ మీడియాలో వేధింపుల పట్ల సైబరాబాద్ పోలీసులకు గతంలోనూ అనేకమంది టాలీవుడ్ సెలబ్రిటీలు ఫిర్యాదు చేశారు. ఫొటో మార్ఫింగ్ ఉదంతాలపై కూడా అనేక ఫిర్యాదులు చేశారు.

Lavanya Tripathi
Harassment
Police
Complaint
CyberCrime
Cyberabad
  • Loading...

More Telugu News