Maharashtra: మహారాష్ట్ర సచివాలయంలో కరోనా కలవరం

Corona case rumour triggers panic in Mantralaya

  • సీనియర్ అధికారికి కరోనా సోకినట్టు వదంతులు 
  • ఉలిక్కిపడ్డ ‘మంత్రాలయ’ ఉద్యోగులు
  • సచివాలయాన్ని శానిటైజ్ చేస్తున్న సిబ్బంది

మహారాష్ట్ర సచివాలయం.. ‘మంత్రాలయ’లో పని చేసే ఓ సీనియర్ అధికారి బంధువుకు కరోనా సోకినట్టు తేలింది. దాంతో మంత్రాలయ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తొలుత సదరు అధికారి కూడా వైరస్ బారిన పడ్డారని మంగళవారం వదంతులు వ్యాపించాయి. దాంతో, ముంబైలోని మంత్రాలయ ఉద్యోగులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన ప్రజా పనుల శాఖ ఏడంతస్తుల కార్యాలయం మొత్తాన్ని శానిటైజ్ చేస్తోంది. కరోనా సోకింది అధికారికి కాదని, ఆయన బంధువుకు మాత్రమే అని స్పష్టం కావడంతో ఉద్యోగులంతా కాస్త కుదుటపడ్డారు.

ముందు జాగ్రత్తగా సెలవులు తీసుకున్న సదరు అధికారి కరోనా పరీక్షలు కూడా చేయించుకున్నారు. అందులో అయనకు నెగిటివ్ వచ్చిందని మరో అధికారి తెలిపారు. ప్రస్తుతం సచివాలయం మొత్తాన్ని ప్రజా పనుల శాఖ తమ అధీనంలోకి తీసుకుందని చెప్పారు. శానిటైజేషన్ ప్రక్రియ వెంటనే మొదలు పెట్టారని, మెట్లు, ఎస్కలేటర్లు, కుర్చీలతో పాటు ప్రతీ ఫ్లోర్‌‌ను శుభ్రపరుస్తారని తెలిపారు.

  • Loading...

More Telugu News