Dulquer Salman: హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్

Hanu Raghavapudi Movie

  • యూత్ లో దుల్కర్ కి మంచి క్రేజ్ 
  • తెలుగు కథకి ఫిదా అయిన దుల్కర్ 
  • తెలుగుతో పాటు తమిళ .. మలయాళ భాషల్లో విడుదల 

తెలుగు ప్రేక్షకులకు దుల్కర్ సల్మాన్ సుపరిచితమే. అనువాద చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఆయన, 'మహానటి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. కొంతకాలంగా నేరుగా మరో తెలుగు సినిమా చేయాలని ఆయన ఆశ పడుతున్నాడు. అలాంటి దుల్కర్ సల్మాన్ ముచ్చట తీరిపోయిందనీ, త్వరలో ఆయన ఓ తెలుగు సినిమా చేయనున్నాడని అంటున్నారు.

'అందాల రాక్షసి' ..'కృష్ణగాడి వీర ప్రేమగాథ' వంటి హిట్ చిత్రాలను అందించిన హను రాఘవపూడి, ఇటీవల దుల్కర్ సల్మాన్ ను కలిసి ఒక కథను వినిపించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇద్దరి మధ్య కథాపరమైన చర్చలు పూర్తయ్యాయని అంటున్నారు. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి, సెట్స్ పైకి వెళ్లాలని అనుకుంటున్నారట. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ భాషల్లోను ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు సమాచారం.

Dulquer Salman
Mahanati Movie
Hanu Raghavapudi Movie
  • Loading...

More Telugu News