PV Sindhu: విరాట్​ కోహ్లీకి ‘సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్’ విసిరిన పీవీ సింధు

PV Sindhu safe hands challenge to Virat Kohli

  • ‘కరోనా’ సోకకుండా ప్రజలను అప్రమత్తం చేసే ‘సేఫ్ హ్యాండ్స్’
  • కేథరిన్ హద్దా విసిరిన ఛాలెంజ్ ను పూర్తి చేసిన సింధు
  • మంత్రి కిరణ్ రిజిజు, సానియా మీర్జాకూ ఛాలెంజ్ విసిరిన సింధు

కరోనా వైరస్ సోకకుండా ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పటికే  భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాయి. పలువురు సెలెబ్రిటీలు కూడా తమ వీడియో సందేశాల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో ప్రముఖ షట్లర్ పీవీ సింధు కూడా తగు సూచనలు చేశారు. హైదరాబాద్ లో అమెరికా కాన్సుల్ జనరల్ కేథరిన్ హద్దా విసిరిన ‘సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్’ను పూర్తి చేశారు. ఈ సందర్భంగా సింధు ఓ ట్వీట్ చేశారు. కేథరిన్ హద్దా కు ‘థ్యాంక్స్’ చెప్పిన సింధు, ‘కరోనా’ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కచ్చితంగా తమ వంతు ప్రయత్నం చేస్తామని చెప్పింది.

ఈ సందర్భంగా మరో ముగ్గురికి సింధు ‘సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్’ విసిరింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాలకు ఈ ఛాలెంజ్ విసిరింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News