Crime News: రంగారెడ్డి జిల్లాలో కలకలం.. ఒంటిపై దుస్తులు లేకుండా యువతి మృతదేహం లభ్యం

girl murder

  • చేవెళ్ల మండలం తంగడపల్లిలో ఘటన
  • ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు
  • హత్యాచారం చేసి ఉంటారని అనుమానం

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లిలో కలకలం చెలరేగింది. ఓ యువతిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కొట్టి చంపారు. ఆమె తలపై తీవ్ర గాయాలు ఉన్నాయి. ఆమె ఒంటిపై దుస్తులు కూడా లేవు. ఆమెను ఇతర ప్రాంతం నుంచి తీసుకొచ్చి అత్యాచారం చేసి, హత్య చేసి అక్కడ పడేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ రోజు ఉదయం 6 గంటలకు స్థానికులు ఓ బ్రిడ్జి కింద ఆమె మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకొచ్చింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు జరుపుతున్నారు. కాసేపట్లో ఆమె మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించనున్నారు. ఆ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు కూడా లేవు.  

Crime News
Ranga Reddy District
  • Loading...

More Telugu News