India: బంగారం నేలచూపులు... పది గ్రాముల ధర రూ. 40 వేల దిగువకు!
- భారీగా తగ్గిన బంగారం ధర
- ఈ ఉదయం రూ. 830 పడిపోయిన పది గ్రాముల ధర
- రూ. 4,280 తగ్గిన కిలో వెండి ధర
ప్రపంచ మార్కెట్ల పతనం బంగారం ధరను భారీగా దిగజార్చింది. ఈ ఉదయం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో స్వచ్ఛమైన బంగారం ధర పది గ్రాములకు క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 830 తగ్గి, 2 శాతం పతనంతో రూ. 39,518కి చేరింది. ఇటీవలి కాలంలో బంగారం ధర రూ. 40 వేల దిగువకు రావడం ఇదే తొలిసారి. ఇదే సమయంలో వెండి ధర కిలోకు రూ. ఏకంగా రూ. 4,280 తగ్గి రూ. 36,207కు చేరింది. క్రూడాయిల్ ధర రూ. 235 తగ్గి రూ. 2,161కి చేరింది. సోమవారం నాటితో పోలిస్తే క్రూడాయిల్ ధర 10 శాతం వరకూ పడిపోవడం గమనార్హం.