Yes Bank: యస్ బ్యాంకు వ్యవహారం.. కార్పొరేట్ దిగ్గజాలు మరో ముగ్గురికి ఈడీ సమన్లు

ED Summons Corporate legends over Yes Bank Issue
  • సుభాశ్ చంద్ర గార్గ్, నరేశ్ గోయల్, సమీర్ గెహ్లట్‌లకు ఈడీ సమన్లు
  • రుణాలు తీసుకుని చెల్లించడంలో విఫలం
  • ఈ వారంలో ఈడీ ఎదుట హాజరు
యస్ బ్యాంకు నుంచి రుణాలు తీసుకుని చెల్లించడంలో విఫలమయ్యారన్న కారణంతో పలువురు కార్పొరేట్ దిగ్గజాలకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 19న వ్యక్తిగతంగా తమ ఎదుట హాజరు కావాలంటూ ఇటీవల వేరే కేసులో అరెస్ట్ అయిన డీహెచ్ఎఫ్ఎల్ సీఎండీ కపిల్ వాద్వాన్‌, అనిల్ అంబానీలకు సమన్లు జారీ చేసిన ఈడీ.. తాజాగా, ఎస్సెల్ గ్రూప్ ప్రమోటర్ సుభాశ్ చంద్ర గార్గ్, జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్, ఇండియా బుల్స్ చైర్మన్ సమీర్ గెహ్లట్‌లకు సమన్లు జారీ చేసింది.

వీరంతా యస్ బ్యాంకు నుంచి పెద్ద ఎత్తున రుణాలు తీసుకుని చెల్లించడంలో విఫలమైనట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈడీ వీరికి సమన్లు జారీ చేసింది. సమన్లు అందుకున్న వారంతా ఈ వారంలో ఈడీ ఎదుట హాజరు కానున్నారు.
Yes Bank
ED
Naresh Goyal
subhash chandra garg
sameer gehlaut

More Telugu News