James Bond actress: జేమ్స్‌బాండ్​ హీరోయిన్‌కు కరోనా పాజిటివ్

James Bond actress tests positive for coronavirus
  • స్వయంగా వెల్లడించిన  ఓల్గా కురిలెంకో
  • ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నట్టు ప్రకటన
  • 2008లో బాండ్‌ చిత్రం ‘క్లాంటమ్‌ ఆఫ్‌ సొలేస్‌’తో ఓల్గాకు గుర్తింపు
కరోనా వైరస్‌ సాధారణ ప్రజలనే కాదు సెలబ్రిటీలను కూడా వదలడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే పలువురికి కరోనా సోకగా.. తాజాగా ఈ జాబితాలో జేమ్స్‌బాండ్‌ సినిమా హీరోయిన్ కూడా చేరింది. ఉక్రెయిన్‌లో పుట్టిన నటి, మోడల్‌ ఓల్గా కురిలెంకో తాను కరోనా బారిన పడినట్టు స్వయంగా వెల్లడించింది.

 2008లో జేమ్స్‌బాండ్‌ చిత్రం ‘క్వాంటమ్ ఆఫ్ సొలేస్‌’తో పాటు 2013లో విడుదలైన ‘ఒబ్లివియన్’తో ఓల్గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే, గత వారం రోజులుగా తాను తీవ్ర జ్వరం, అలసటతో బాధపడుతున్నానని 40 ఏళ్ల  ఓల్గా తెలిపింది. వైద్య పరీక్షల్లో తనకు కరోనా పాజిటివ్‌ అని తేలడంతో బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నట్టు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.  కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించింది.

కాగా, గతవారం హాలీవుడ్ జంట టామ్ హాంక్స్, రీటా విల్సన్‌లకు కూడా కరోనా వైరస్‌ నిర్ధారణ అయింది. అలాగే, యూనివర్సల్‌ మ్యూజిక్‌ చైర్మన్‌, సీఈవో లుసియన్ గ్రినేజ్‌ కరోనా బారిన పడి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో జేమ్స్‌బాండ్‌ సిరీస్‌లో కొత్త సినిమా ‘నో టైమ్‌ టు డై’విడుదలను నవంబర్‌‌ వరకు వాయిదా వేశారు.
James Bond actress
Olga Kurylenko
tests positive
coronavirus

More Telugu News