Madala Ranra Rao: నాడు ఎన్టీఆర్ తో ఏం జరిగిందో తెలియదు .. ఇక నాన్నగారికి ఎవరూ అవకాశాలు ఇవ్వలేదు: మాదాల రవి
- నాన్నగారిలో ఉద్యమభావాలు ఎక్కువ
- కాలేజ్ రోజుల్లోనే ప్రజానాట్యమండలి కళాకారుడు
- 'దానవీరశూరకర్ణ' నుంచి తొలగించారన్న రవి
తెలుగు తెరపై విప్లవ భావాలు కలిగిన కథలను ఆవిష్కరించిన కథానాయకుడిగా మాదాల రంగారావు కనిపిస్తారు. ఆయన పేరు వినగానే 'యువతరం కదిలింది' .. 'ఎర్ర మల్లెలు'.. ' విప్లవ శంఖం' వంటి సినిమాలు కళ్లముందు కదలాడతాయి.
తాజా ఇంటర్వ్యూలో ఆయన తనయుడు మాదాల రవి మాట్లాడుతూ .. "ప్రకాశం జిల్లా .. ఒంగోలులోని 'మైనంపాడు' మా సొంత ఊరు. నాన్నగారిలో మొదటి నుంచి విప్లవభావాలు ఎక్కువ. ఈ కారణంగానే ఆయన కాలేజ్ రోజుల్లోనే ప్రజానాట్యమండలి ద్వారా ప్రదర్శనలు ఇచ్చేవారు. ఆ తరువాత మద్రాస్ వెళ్లి సినిమాల్లో అవకాశాలు సంపాదించడానికి చాలా కష్టాలు పడ్డారు.
కాలక్రమంలో కొన్ని పాత్రలు మంచి గుర్తింపు తెచ్చిన కారణంగా, 'దాన వీర శూర కర్ణ'లో అర్జునుడి వేషం ఇచ్చారు. ఆ తరువాత ఆ పాత్ర నుంచి ఆయనను తొలగించారు. అక్కడ ఏం ఘర్షణ జరిగిందన్నది తెలియదు. ఆ తరువాత నుంచి నాన్నగారికి అవకాశాలు ఇవ్వడానికి ఎవరూ ఇష్టపడలేదు. దాంతో ఆయనే సొంత నిర్మాణ సంస్థను స్థాపించాలనే నిర్ణయానికొచ్చారు" అని చెప్పుకొచ్చారు.