Raja Singh: నిరూపించండి.. తెలంగాణ నుంచి వెళ్లిపోతా: అసెంబ్లీలో రాజాసింగ్ సవాల్

Raja Singh fires on KCR

  • ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేస్తున్నారు
  • సీఏఏ వల్ల ఎవరికి అన్యాయం జరుగుతుందో నిరూపించాలి
  • అసత్యాలు మాట్లాడుతూ రాజకీయాలు చేయడం మంచిది కాదు

రాష్ట్ర ప్రజలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. అసెంబ్లీలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, సీఏఏ వల్ల ఎవరికైనా అన్యాయం జరుగుతుందని నిరూపిస్తే... ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తెలంగాణ నుంచి వెళ్లిపోతానని చెప్పారు.

 ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పడం సరికాదని అన్నారు. సీఏఏ వల్ల ఎవరికి అన్యాయం జరుగుతుందో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. అసత్యాలు మాట్లాడుతూ రాజకీయాలు చేయడం తగదని హితవు పలికారు. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీల వల్ల ఎవరికీ అన్యాయం జరగదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పినప్పటికీ విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మైకును స్పీకర్ కట్ చేశారు. దీంతో, తీర్మాన ప్రతులను రాజాసింగ్ చింపేశారు. ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని నినదించారు.

Raja Singh
BJP
KCR
TRS
CAA
NPA
NRC
  • Loading...

More Telugu News