Anil Ravipudi: నాకు ఫ్లైట్ ఫోబియా ఉంది.. హడలిపోతా!: అనిల్ రావిపూడి

Anil Ravipudi tells about his flight phobia

  • విమాన ప్రయాణం అంటే చాలా భయమన్న అనిల్
  • పటాస్ కు ముందు జీవితం చాలా కష్టంగా గడిచిందని వెల్లడి
  • భార్య మద్దతు ఉండేదని వివరణ

'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి ఓ కార్యక్రమంలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనకు ఫ్లైట్ ఫోబియా ఉందని చెప్పారు. విమానం సజావుగా వెళుతుంటే తాను కూడా స్థిమితంగానే ఉంటానని, ఎక్కడైనా కుదుపు వస్తే హడలిపోతానని వివరించారు. అక్కడ్నించి తన విమాన ప్రయాణాన్ని చిత్రీకరిస్తే ఓ సినిమా అవుతుందని చమత్కరించారు.  విమాన ప్రయాణం అంటే అంతగా భయపడతానని తెలిపారు.

ఇక పటాస్ చిత్రం కంటే ముందు తన లైఫ్ ఒడిదుడుకుల మయం అని, భార్య మద్దతు ఉన్నా, జీవితంలో స్థిరపడలేకపోయానని బాధపడుతుండేవాడ్నని చెప్పారు. కాలేజీలో క్లాస్ మేట్ నే పెళ్లి చేసుకున్నానని, కాలేజీలో 'ఛలో తిరుపతి' అనే స్కిట్ చేసినప్పుడు మొదటగా ఆమే కంగ్రాట్స్ చెప్పిందని వెల్లడించారు.

Anil Ravipudi
Flight
Phobia
Tollywood
  • Loading...

More Telugu News