Rana: కరోనా ఎఫెక్ట్ .. 'అరణ్య' విడుదల తేదీ వాయిదా

Aranya Movie

  • విలక్షణ నటుడిగా ఎదుగుతున్న రానా 
  • వివిధ భాషల్లో వైవిధ్యభరిత చిత్రాలు 
  • త్వరలో 'అరణ్య' కొత్త విడుదల తేదీ ప్రకటన 

తెలుగు.. తమిళ .. హిందీ భాషల్లో వైవిధ్యభరితమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ రానా ముందుకు వెళుతున్నాడు. 'బాహుబలి'తో పెరిగిన ఆయన మార్కెట్ కారణంగా, వివిధ భాషల్లో ఆయన సినిమాలు భారీస్థాయిలో విడుదలవుతున్నాయి. హిందీలో ఆయన చేసిన 'హాథీ మేరే సాథీ' సినిమాను, తెలుగులో 'అరణ్య' టైటిల్ తోను .. తమిళంలో 'కాదన్' టైటిల్ తోను ఏప్రిల్ 2వ తేదీన విడుదల చేయాలని కొన్ని రోజుల క్రితం నిర్ణయించారు.

అయితే 'కరోనా వైరస్' ప్రపంచ దేశాలను వణికిస్తున్న నేపథ్యంలో, సినిమా షూటింగులను .. ప్రదర్శనలను రద్దు చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే థియేటర్లను మూసేశారు. అందువలన ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్టుగా నిర్మాతలు ప్రకటించారు. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామనే విషయాన్ని తెలియజేశారు.

Rana
Hathi Mere Saathi Movie
Aranya Movie
  • Loading...

More Telugu News