Yes Bank: యస్ బ్యాంకు కేసు: అనిల్‌ అంబానీకి ఈడీ షాక్

yes bank case ed summoned anil ambani

  • యస్‌ బ్యాంక్‌లో జరిగిన పరిణామాలపై విచారణ 
  • ఆ బ్యాంక్‌ నుంచి రిలయన్స్‌ గ్రూప్‌ రూ.12,800 కోట్లు రుణాలు
  • నిరర్థక ఆస్తులుగా మారిన వైనం 

యస్‌ బ్యాంక్‌లో జరిగిన పరిణామాలపై విచారణ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీకి షాక్ తగిలింది. ఈ కేసులో విచారణ నిమిత్తం హాజరు కావాలని ఆయనకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఆ బ్యాంక్‌ నుంచి రిలయన్స్‌ గ్రూప్‌ రూ.12,800 కోట్లు రుణాలు తీసుకోవడం, అవి నిరర్థక ఆస్తులుగా మారడంతో ఆయనపై ఈడీ అధికారులు విచారణ జరపనున్నారు.

నోటీసులపై అనిల్ అంబానీ స్పందిస్తూ.. ఈడీ ఎదుట హాజరయ్యేందుకు సమయం కావాలని, ఆరోగ్యం బాగోలేదని చెప్పారు. కాగా, సంక్షోభంలో కూరుకుపోయిన యస్‌ బ్యాంక్‌లో పెట్టుబడులకు పలు బ్యాంకులు ముందుకు వస్తున్నాయి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News