Nagababu: రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థలని విమర్శించటం మాని, ప్రజారోగ్యము మీద దృష్టి పెట్టండి: జగన్ కు నాగబాబు సూచన

Nagababu Setires on Jagan

  • నవ్వాలో, ఏడవాలో అర్థం కావడం లేదు
  • లైఫ్ కన్నా ఏదీ ముఖ్యం కాదు
  • బాధ మాని తక్షణ చర్యలపై ఫోకస్ పెట్టండి
  • ట్విట్టర్ వేదికగా సెటైర్లు

సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్ వేదికగా నటుడు నాగబాబు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సెటైర్లు వేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్లు పెట్టిన ఆయన, "కొంత మంది మీడియా వ్యక్తులు కూడా ఈ వాయిదాని వాళ్ల వెబ్ సైట్స్ లో విమర్శిస్తుంటే ఆశ్చర్యపోయాం. మీరు వైసీపీ ని సమర్ధిస్తే తప్పు లేదు.. కానీ వైసీపీ కన్నా మీరే ఎక్కువ బాధ పడుతుంటే నవ్వాలో ఎడవలో అర్థం కాలేదు. లైఫ్ కన్నా ఏది ఎక్కువ కాదు. బాధపడటం మాని తక్షణ చర్యల మీద ఫోకస్ పెట్టండి" అని అన్నారు.

"కొన్నిసార్లు పరిస్థితులు అన్నీ మనకు అనుకూలంగా రావు. భరించాలి. ప్రజారోగ్యం ముఖ్యం. ఫోకస్ ఆన్ ఇట్. రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థలని విమర్శించటం మాని ప్రజారోగ్యము మీద దృష్టి పెట్టండి. 151 మంది ఎంఎల్ఏలని ఇచ్చి అధికారం కట్టబెట్టిన ప్రజల సంక్షేమం ముఖ్యం. థాంక్స్ సీఎం గారు" అని నాగబాబు అన్నారు. 

Nagababu
Jagan
Twitter
  • Error fetching data: Network response was not ok

More Telugu News