Nitin: హీరో నితిన్ వివాహం వాయిదా!

Hero Nitin Postpones His Marriage with Shalini

  • నితిన్ కు షాలినితో ఇటీవలే నిశ్చితార్థం
  • దుబాయ్ ని తాకిన కరోనా ప్రభావం
  • పెళ్లి వాయిదా ఆలోచనలో నితిన్

యువ హీరో నితిన్ వివాహం వాయిదా పడనుందని తెలుస్తోంది. తాను ప్రేమించిన షాలినితో నిశ్చితార్థం చేసుకున్న నితిన్, ఏప్రిల్ 16న దుబాయ్ లో వివాహానికి వేదికను కూడా ఎంచుకున్నారు. అయితే, కరోనా ప్రభావం ఈ వివాహంపైనా పడింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా భయంతో విదేశీయులను పలు దేశాలు నిషేధిస్తుండటంతో, తన పెళ్లిని వాయిదా వేసుకోవాలని నితిన్ నిర్ణయించుకున్నారని సమాచారం.

ఇప్పటికే పెళ్లి పనులు కూడా మొదలు కాగా, వచ్చే నెల 15న ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు, ఆపై 16న రిసెప్షన్ కూడా ప్లాన్ చేసుకున్నారు. దుబాయ్ ని కూడా కరోనా పట్టి పీడిస్తుండటంతో వివాహాన్ని వాయిదా వేసుకునేందుకే నితిన్ మొగ్గు చూపుతుండగా, హైదరాబాద్ లో వివాహం చేసుకోవాలని కొందరు బంధుమిత్రులు సలహా ఇస్తున్నట్టు సమాచారం. నితిన్, షాలినీల వివాహ వాయిదాపై అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.

Nitin
Shalini
Marriage
Postpone
Dubai
Corona Virus
  • Loading...

More Telugu News