IPL: అభిమానులు వీడ్కోలు పలుకుతుండగా... చెన్నైని వీడిన మహేంద్ర సింగ్ ధోనీ... వీడియో ఇదిగో!

MS Dhoni Leaves for Ranchi from Chennai

  • వాయిదా పడిన ఐపీఎల్
  • ప్రాక్టీస్ సెషన్ ను నిలిపివేసిన చెన్నై సూపర్ కింగ్స్
  • స్వస్థలాలకు బయలుదేరిన ఆటగాళ్లు

కరోనా భయంతో ఐపీఎల్ పోటీలు వాయిదా పడగా, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా, గత రెండు వారాల నుంచి చెన్నైలో ఉండి, ప్రాక్టీస్ చేస్తూ, జట్టుతో కలిసున్న ఎంఎస్ ధోనీ, రాంచీకి బయలుదేరి వెళ్లారు. వాస్తవానికి ఐపీఎల్ పోటీలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కావాల్సివుండగా, వాటిని ఏప్రిల్ 15కు వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. అప్పుడన్నా ప్రారంభమవుతాయా? అన్న విషయంపైనా సందేహాలు నెలకొనివున్నాయి.

ఈ నేపథ్యంలో చెన్నై ఫ్రాంచైజీ యాజమాన్యం, ప్రాక్టీస్ సెషన్ ను తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో ధోనీ సహా, జట్టులో కీలక ఆటగాళ్లయిన సురేశ్ రైనా, అంబటి రాయుడు వంటి వారు స్వస్థలాలకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా వారికి చిన్న వీడ్కోలు కార్యక్రమం జరిగింది.

ఇందులో భాగంగా చెపాక్ స్టేడియంలో కాసేపు గడిపిన ధోనీ, ఫ్యాన్స్ కు ఆటోగ్రాఫ్ లు సెల్ఫీలు ఇస్తూ సరదాగా కాలం గడిపాడు. ఈ వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ తమ అధికార ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఐపీఎల్ పై స్పష్టత వచ్చిన తరువాతనే ధోనీ తిరిగి చెన్నైకి వస్తారని ప్రకటించింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News