Tamilnadu: దుస్తుల కంపెనీలో ఉద్యోగి నిర్వాకం... వేసుకున్న ప్యాంటులో 100 టీ షర్ట్స్... వీడియో ఇదిగో!

Employee Theft in Garment Factory

  • తమిళనాడులోని తిరుప్పూర్ లో ఘటన
  • పనిచేస్తున్న కంపెనీలో టీ షర్ట్స్ దొంగతనం
  • పట్టేసిన సూపర్ వైజర్

తాను పని చేస్తున్న కంపెనీకి కన్నం వేయబోయిన ఓ ఉద్యోగి అడ్డంగా దొరికిపోయాడు. ఇప్పుడు అతని వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తమిళనాడులోని తిరుప్పూర్ లో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే, ఇక్కడి ప్రభుత్వ దుస్తుల కంపెనీ ఉద్యోగి బయటకు వెళుతున్న సమయంలో చూసిన సూపర్ వైజర్ కు అతనిలో ఏదో తేడా కనిపించింది.

సన్నాగా ఉండాల్సిన అతని కాళ్లు, చాలా లావుగా కనిపించడంతో, అనుమానం వచ్చి పరిశీలించారు. అతని ప్యాంటులో ఒకటి కాదు, రెండు కాదు... ఏకంగా 100 టీ షర్టులు బయట పడ్డాయి. కంపెనీలో తయారు చేసిన టీ షర్ట్ లను బయట అమ్ముకునేందుకు తీసుకు వెళుతున్నానని అతను చెప్పడం గమనార్హం. ఈ మొత్తం వ్యవహారాన్ని కొందరు తమ స్మార్ట్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో ఉంచారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News