Bonda Uma: మమ్మల్ని చంపాలని చూశారు .. 72 గంటల నిరాహార దీక్ష చేస్తాను: బోండా ఉమ

bonda uma on ycp attack

  • ఫిర్యాదు చేసేందుకు మాచర్ల వెళ్లాం 
  • బాధితులైన మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు
  • హైకోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేస్తున్నాం

తనపై ఇటీవల మాచర్లలో జరిగిన దాడి గురించి టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు నిరాహార దీక్షకు దిగుతానని ప్రకటించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... నామినేషన్లు తీసుకోవడం లేదని ఫిర్యాదు చేసేందుకు మాచర్ల వెళ్లామని, దాడి చేసి తమని చంపాలని చూశారని తెలిపారు.

ఈ దాడి కేసులో నిందితులను వదిలేసి బాధితులైన తమను ప్రశ్నిస్తున్నారని బోండా ఉమ అన్నారు. తాము కోర్టుకు వెళ్తామన్నాక సెక్షన్లు మార్చి కేసు నమోదు చేశారని తెలిపారు. పోలీసులే సుమోటోగా కేసు నమోదు చేశామని చెబుతున్నారని చెప్పారు. మాచర్ల ఘటనపై హైకోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేస్తున్నామని తెలిపారు. న్యాయం కోసం 72 గంటల నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు.

Bonda Uma
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News