Hindu Maha Sabha: గోమూత్రం తాగితే కరోనా పరార్.. ఇష్టంగా తాగిన 200 మంది!

Hindu Maha sabha Hosts Cow Urine Drinking Party
  • గోమూత్ర పార్టీ నిర్వహించిన అఖిల భారతీయ హిందూ మహాసభ
  • స్వామి చక్రపాణి సహా గోమూత్రం తాగిన 200 మంది
  • దేశవ్యాప్తంగా ఇలాంటి పార్టీలు నిర్వహిస్తామని ప్రకటన
భయపెడుతున్న కరనా వైరస్ నుంచి బయపడేందుకు గోమూత్రం చక్కని ఔషధంలా పనిచేస్తుందని అఖిల భారతీయ హిందూ మహాసభ పేర్కొంది. ఈ మేరకు ‘గోమూత్ర పార్టీ’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో స్వామి చక్రపాణి మహరాజ్ సహా ఆయన బృంద సభ్యులు గోమూత్రాన్ని తాగారు. అంతేకాదు, కార్యక్రమంలో పాల్గొన్న దాదాపు 200 మంది కూడా గోమూత్రాన్ని తాగారు. ఈ సందర్భంగా స్వామి చక్రపాణి మాట్లాడుతూ.. గోమాంసం తిన్నందు వల్లే కేరళలో వరదలు సంభవించాయన్నారు. గోమూత్రం తాగితే కరోనా దరిచేరదని అన్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి ‘గోమూత్ర పార్టీ’లను మరిన్ని నిర్వహించి ప్రజల్లో అవగాహన పెంచుతామని ఈ సందర్భంగా స్వామి చక్రపాణి మహరాజ్ పేర్కొన్నారు.

తాము 21 సంవత్సరాల నుంచి గోమూత్రం తాగుతున్నామని, ఆవు పేడతో స్నానం చేస్తున్నామని పార్టీకి హాజరైన ఓ ప్రకాశ్ తెలిపారు. ఈ కారణంగా ఇంగ్లిష్ మందులు వాడాల్సిన అవసరం తమకు రాలేదన్నారు. కేన్సర్‌ను నివారించేందుకు గోమూత్రం చక్కని ఔషధంలా పనిచేస్తుందని కార్యక్రమానికి హాజరైన బీజేపీ నేతలు తెలిపారు.
Hindu Maha Sabha
Cow Urine
corona virus
Cow Urine Drinking Party

More Telugu News