Allu Arjun: తన బాడీగార్డు పుట్టినరోజు వేడుక నిర్వహించిన అల్లు అర్జున్

Allu Arjun attends his bodyguard birthday party
  • బాడీగార్డుతో కేక్ కోయించి గిఫ్టు ఇచ్చిన బన్నీ
  • బన్నీని చూసి సుకుమార్ సినిమాలో లుక్ ఇదేనంటున్న ఫ్యాన్స్
  • ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న బన్నీ
టాలీవుడ్ అగ్రహీరో అల్లు అర్జున్ తన బాడీగార్డు పుట్టినరోజు వేడుక నిర్వహించడం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం అవుతోంది. సుకుమార్ దర్శకత్వంలో అరణ్యం నేపథ్యంగా సాగే సినిమాలో అల్లు అర్జున్ ఓ లారీ డ్రైవర్ పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. బాగా గడ్డం పెంచి రఫ్ లుక్ తో ఉన్న బన్నీ తన బాడీగార్డు బర్త్ డే పార్టీలో ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. అతడితో కేక్ కట్ చేయించడమే కాదు, ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. కాగా, దీనికి సంబంధించిన ఫొటోల్లో బన్నీని చూసిన వారు, సుకుమార్ సినిమాలో లుక్ ఇదేనని కన్ఫామ్ చేస్తున్నారు.
Allu Arjun
Body Guard
Birthday
Cake
Gift
Sukumar
Lorry Driver

More Telugu News