Corona Virus: కరోనా ఎఫెక్ట్: రేపటి నుంచి దేశంలోని పలు సరిహద్దుల మూసివేత!

india decided to  close check posts from tomorrow
  • ఆదేశాలు జారీ చేసిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ
  • రేపు అర్ధరాత్రి తర్వాత మూతపడనున్న చెక్‌పోస్టులు
  • నేపాల్, భూటాన్ నుంచి విదేశీయులు రాకుండా అడ్డుకోవాలని ఆదేశాలు
దేశంలో రోజురోజుకు కరోనా నిర్ధారిత కేసుల సంఖ్య పెరుగుతుండడంతో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మయన్మార్ దేశాల సరిహద్దుల్లో ఉన్న చెక్ పోస్టులను రేపటి నుంచి మూసివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

దేశ సరిహద్దుల్లో మొత్తం 37 ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్టులు ఉండగా వాటిలో 19 చెక్‌పోస్టులు నేటి అర్ధరాత్రి వరకు పనిచేయనున్నాయి. రేపు అర్ధరాత్రి తర్వాత ఇండియా-బంగ్లాదేశ్, ఇండియా-నేపాల్, ఇండియా-భూటాన్, ఇండియా-మయన్మార్ సరిహద్దుల్లోని చెక్‌పోస్టులు మూతపడనున్నాయి. అలాగే, నేపాల్, భూటాన్ దేశాల నుంచి విదేశీయులు దేశంలోకి రాకుండా అడ్డుకోవాలని హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇటలీ, ఇరాన్, చైనా, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, కొరియా దేశాల్లో పర్యటించి దేశానికి వచ్చే వారిని ఐసోలేషన్ వార్డులకు తరలించాలని ఆదేశించింది.  
Corona Virus
India
Nepal
Bhutan
checkposts

More Telugu News