actress trisha: చిరంజీవి ‘ఆచార్య’ నుంచి తప్పుకున్న త్రిష.. ట్విట్టర్ ద్వారా వెల్లడి!

Actress Trisha Shocking decision on Chiru Movie

  • 'ఆచార్య'లో హీరోయిన్ గా ఎంపికైన త్రిష 
  • సృజనాత్మక వైరుధ్యాలతో తప్పుకుంటున్నట్టు ప్రకటన
  • మరో మంచి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తానన్న త్రిష

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు త్రిష తాజాగా ప్రకటించింది. త్వరలో ఈ సినిమా షూటింగులో పాల్గొనాల్సిన ఆమె అందరికీ షాకిస్తూ తన నిర్ణయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.

సృజనాత్మక వైరుధ్యాల కారణంగా ‘ఆచార్య’ నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపింది. కొన్నిసార్లు మనతో చర్చించిన విషయాలు ఒకటైతే, వాస్తవంలో కనిపించేవి వేరేగా ఉంటాయని, చిరంజీవి సర్ సినిమా నుంచి తప్పుకుంటున్నందుకు ఈ విభేదాలే కారణమని వివరణ ఇచ్చింది. అయితే, మరో మంచి సినిమాతో తెలుగు అభిమానుల ముందుకు వస్తానని త్రిష పేర్కొంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News