Macherla: మాచర్ల దాడి ఘటనపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన

Election commissioner responds on Macherla incident

  • మాచర్ల ఘటనపై ఈసీ చర్యలను వెల్లడించిన కమిషనర్
  • ముగ్గురు వ్యక్తులు దాడి ఘటనలో పాల్గొన్నారని వెల్లడి
  • నివేదిక ఆధారంగా వారిని అరెస్ట్ చేశామన్న కమిషనర్

గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన ఘటనపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. ఎన్నికల కమిషనర్ రమేశ్ ఘటనపై తీసుకున్న చర్యలను వెల్లడించారు. మాచర్ల దాడి ఘటనలో ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నారని రమేశ్ వివరించారు. వారు పోలీసు అధికారి విధులకు ఆటంకం కలిగించారని తెలిపారు. ప్రజాప్రతినిధులపై దాడులు చేసేందుకు ప్రయత్నించారని వివరించారు.

ఘటనపై జిల్లా కలెక్టర్, పోలీసు అధికారులు విచారణ చేపట్టారని వెల్లడించారు. నివేదిక ఆధారంగా పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారని రమేశ్ పేర్కొన్నారు. 307, 153 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని వివరించారు. శాంతిభద్రతల విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించామని చెప్పారు.

  • Loading...

More Telugu News