KE Prabhaker: వైసీపీ నుంచి నాకు ఆహ్వానం వస్తే ఆలోచిస్తాను: కేఈ ప్రభాకర్​

KE Prabhaker says if  I get a call from ysrcp I will think

  • టీడీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ కేఈ
  • ఏ పార్టీలో చేరితే బాగుంటుందో మా కార్యకర్తలతో చర్చిస్తా
  • ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటా

కర్నూలు జిల్లా ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ టీడీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అనుచరులకు టికెట్లు లభించకపోవడం అసంతృప్తికి గురిచేసిందని, అందువల్లే, పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిందని ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా తనను పలకరించిన మీడియాతో ఆయన మాట్లాడారు. ‘భవిష్యత్ లో ఏ పార్టీలో చేరబోతున్నారు?’ అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, తమ కార్యకర్తలతో చర్చించి ఏ పార్టీలో చేరితే బాగుంటుందో తెలుసుకుని ఆ పార్టీలో చేరతానని స్పష్టం చేశారు. ఇంతవరకూ వైసీపీ నుంచి తనకు ఆహ్వానం రాలేదని, తనను ఆహ్వానిస్తే తప్పకుండా ఈ విషయమై ఆలోచిస్తానని అన్నారు.

  • Loading...

More Telugu News