Peddireddi Ramachandra Reddy: చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా నిలుపుకునే పరిస్థితి లేదు: మంత్రి పెద్దిరెడ్డి

MInister Peddyreddy prediction on chandrababu

  • జగన్ పై, నాపై ఆరోపణలు చేయడం తప్ప బాబుకు ఇంకోపని లేదు
  • రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టాలని చూస్తున్నారు
  • ఇంకొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు బయటకొచ్చేసినా ఆశ్చర్యం లేదు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ‘కోడ్’ ఉల్లంఘన జరుగుతోందని, అధికార పార్టీ దాడులు చేస్తోందని, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిన్న ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటుగా స్పందించారు. చిత్తూరు జిల్లాలో రెండు రోజులు గలాటా జరిగిందని, తమపై అపవాదులు రాకుండా ఉండేందుకు ఎస్పీకి చెప్పి ఇందుకు కారకులైన వారిపై కేసులు కూడా పెట్టించానని, అవేవీ చంద్రబాబుకు కనపడవని విమర్శించారు.

సీఎం జగన్ పైనా, తనపైనా ఆరోపణలు, విమర్శలు చేయడం తప్ప చంద్రబాబుకు ఇంకోపని లేదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టాలని చంద్రబాబు చూస్తే ఆయనకు ప్రజలు తగినబుద్ధి చెబుతారని అన్నారు. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా నిలుపుకునే పరిస్థితి లేదని, ఆ పార్టీ నుంచి ఇంకొంతమంది ఎమ్మెల్యేలు బయటకొచ్చేసినా ఆశ్చర్యం లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Peddireddi Ramachandra Reddy
YSRCP
Chandrababu
Telugudesam
Jagan
  • Loading...

More Telugu News