KE Prabhakar: అనుకున్నట్టుగానే... టీడీపీకి షాకిస్తూ, రాజీనామా చేసిన కేఈ ప్రభాకర్!

KR Prabhakar Resigns Telugu desham Party

  • రాజీనామా లేఖ చంద్రబాబుకు
  • గుర్తింపు లేని చోట ఉండాల్సిన అవసరం లేదు
  • అనుచరులతో కేఈ ప్రభాకర్

ఈ ఉదయం తన అనుచరులతో ప్రత్యేకంగా సమావేశమైన కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కార్యకర్తల ముందే రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపిన ఆయన, గుర్తింపు లేని చోట ఉండాల్సిన అవసరం లేదని తన అనుచరులతో ఆయన వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.

తన అన్న, మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తితోనూ తనకు జరిగిన అన్యాయం గురించి, స్థానిక ఎన్నికల్లో తన వారికి జరిగిన నష్టం గురించి వివరించానని ఆయన అన్నారు. న్యాయం జరిగే అవకాశం లేదని భావించిన మీదటే రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నానని స్పష్టం చేశారు.

KE Prabhakar
Resign
Telugudesam
Chandrababu
  • Loading...

More Telugu News